అదివో ... అల్లదివో ... శ్రీహరి వాసము
(ఆర్తితో,ఆశలతో, శ్రమదమముల కోర్చిఆ దివ్యమంగళ రూపాన్నికనులారా తిలకించాలని తరలివచ్చే భక్తులకీ గేయం )
ఓ ... తిరుపతి వేంకటదేవా నా ఎదలో నిలువగరావా ...
వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా ! వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా!
నీ గర్భగుడిని చేరాకా నీ దివ్యస్వరూపం చూసాకా ! వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా!
వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వేచి వేచి నీ గుడి ముంగిట పది ఝాముల ఫై దాకా ! వెంకటేశ నిను వేడుకొనుచు పడిగాపులుగాసాకా ! వేచివేచి!
ఆలయ ప్రవేశమైనాకా, పలుభక్తులు అడ్డుగ నిలిచాకా ! ఆలయ ప్రవేశమైనాకా పలుభక్తులు అడ్డుగ నిలిచాకా !
నీ రూపం కనబడి కనబడకా ! నా మనసా నీపై నిలబడకా ! రూపం కనబడి కనబడక, నా మనసా నీపై నిలబడక !
ఒక్క క్షణం ............ ఒక్క క్షణం నిను చూసినంత పూజారులు ప్రక్కకు నెడుతుంటే ! వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా! వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వజ్ర కిరీటం చూసే భాగ్యం కలుగనే లేదూ ! శంఖ, చక్రములు చూసే కోరిక తీరనే లేదూ ! వజ్ర!
వక్షస్థలమున లక్ష్మి ని గాని మెడలో కౌస్తుభ హారం గాని ! వక్ష !
పాదపద్మముల సొగసును గాని చూసే సమయం లేదూ ....... !పాద !
నీ కరుణా వీక్షణ నాపై, ప్రసరితువనే ఆశతో ! కరుణా వీక్షణ నాపై ప్రసరితువనే ఆశతో !
వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా! వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వెనక్కి వెనక్కి తిరుగుతూ !
పాదపద్మముల సొగసును గాని చూసే సమయం లేదూ ....... !పాద !
నీ కరుణా వీక్షణ నాపై, ప్రసరితువనే ఆశతో ! కరుణా వీక్షణ నాపై ప్రసరితువనే ఆశతో !
వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక నే వెడుతున్నా! వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వెనక్కి వెనక్కి తిరుగుతూ !
వెనక్కి వెనక్కి తిరుగుతూ !