అనంతకాలన్ని ఆరు భాగాలు చేసి (సంవత్సరం,ఆయనం,ఋతువు, మాసం,పక్షం,రోజు ) ఆరు ఋతువుల్లో అందమైన ఆమనిలో వచ్చే, ఆరు రుచుల పండగే ఉగాది
మన్మధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఉగాది వచ్చింది అంటే ప్రకృతి పరవశం తో వళ్ళు విరుచుకొంటుంది
కోయిల గానం తో మేలుకోలిపితే
చెట్లు పూల సుగంధాలతో, తియ్యని ఫలాలతో స్వాగతిస్తాయి
నదీ, నదాలు అమృతధారలు కురిపిస్తాయి
వీటన్నిటిని తీయగా, తృప్తిగా, ఆనందంగా మనం ఆ స్వాదించటానికి
"మన్మధుడు " తానే స్వయంగా మనోరంజకుడై
"చైత్రరదానెక్కి " మనముందుకి వస్తున్న ఈ నూతన సంవత్సర శుభవేళ
నా ఆత్మీయులందరు ఆయురారోగ్యఐశ్వర్యాలతో ఉండాలని కోరుకొంటూ
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు